ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
రేపు హాజరు కానున్న...
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు అందరు ఎమ్మెల్యేలపై పిటీషన్లను విచారించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ పై తీర్పు రిజర్వ్ లో ఉంది. దానం నాగేందర్ విచారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కోరిక మేరకు వాయిదా వేసింది. ఇందులో భాగంగా కడియం శ్రీహరి రేపు విచారణకు హాజరు కావాలని తెలిపారు.