శాంతిస్తున్న గోదారి.. తగ్గుతున్న నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. మరో రెండు అడుగులు తగ్గితే మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను తొలగిస్తారు.

Update: 2022-07-19 03:44 GMT

గోదావరి వరద నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. మరో రెండు అడుగులు తగ్గితే మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను తొలగిస్తారు. 53 అడుగులకు తగ్గితే మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55.8 అడుగుల మేర కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నానికి గోదావరి నీటిమట్టం మరింత తగ్గే అవకాశముందని అధికారులు చెబుుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నీటిమట్టం కూడా క్రమంగా తగ్గుతుంది. ఉగ్రరూపం దాల్చిన గోదారి శాంతిస్తుంది. నాలుగైదు రోజుల పాటు గోదావరి ఉగ్రరూపం చూపించడంతో ప్రజలు వణికిపోయారు.

వ్యాధులతో ఇబ్బందులు...
గోదావరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగింది. భద్రాచలం వద్ద 71.3 అడుగుల రికార్డు స్థాయిలో నీటి మట్టానికి చేరింది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీలు కూడా వరద నీటితో మునిగిపోయాయి. దీంతో అధికారులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడిప్పుడే కొంత ముంపు ప్రాంతాలు తేరుకుంటున్నాయి. భద్రాచలం పట్టణంలో మోటార్లతో నీటిని తోడుతున్నారు. గోదావరి వరదతో ఐదారు రోజులు నీటమునగిన ప్రాంతాల్లో వ్యాధులు సంక్రమించే అవకాశముండటంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నారు.


Tags:    

Similar News