Telangana : నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ
నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు
నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా రానున్నారు. నేడు హైదరాబాద్కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకుంటుండటంతో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. ఆయన మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.
వికారాబాద్ లోని...
అనంతరం వికారాబాద్ జిల్లాకు సీఎం రేవంత్, రాహుల్ గాంధీలు బయలుదేరి వెళతారు. అనంతగిరిలో జరిగే తెలుగు రాష్ట్రాల డీసీసీలకు శిక్షణా తరగతులు జరుగుతుండటటంతో అక్కడకు వెళ్లనున్నారు. తరగతుల ముగింపు కార్యక్రమానికి రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పార్టీని రెండు రాష్ట్రాల్లో మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులకు సూచించనున్నారు.