Breaking : తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి గన్ మెన్ కాల్పులు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

Update: 2025-07-13 06:43 GMT

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కల్వకుంట కవితపై చేసిన వ్యాఖ్యలతో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. అయితే చింతపండు నవీన్ కార్యాలయంపై కొందరు యువకులు దాడి చేయడంతో తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. తీన్మార్ మల్లన్న ప్రత్యేక ఛానెల్ ద్వారా రాజకీయాలపై వ్యాఖ్యానాలు చేస్తుంటారు.

కవితపై చేసిన వ్యాఖ్యలతో....
అయితే కవితపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయని, అయితే దాడి చేసిన వారు ఎవరో తెలియదని చెబుతున్నారు. ఈ దాడిలో చింతపండు నవీన్ కార్యాలయం పాక్షికంగా ధ్వంసం అయింది. అయితే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ఆందోళనకారులు పరారయ్యారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరు దాడి చేశారన్న దానిపై సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. దాడి చేసిన వారు తెలంగాణ జాగృతి కార్యకర్తలుగా పోలీసులు ప్రాధమికంగా గుర్తించనిట్లు తెలిసింది. తీన్మార్ మల్లన్న గన్ మెన్ ఐదు రౌండ్లను గాలిలోకి కాల్పలు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది. 


Tags:    

Similar News