నిజాం పాలనను తలపిస్తోంది
తెలంగాణలో నిజాం పాలనను తలపిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో నిజాం పాలనను తలపిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పుత్రవాత్సల్యం కోసం పార్టీ పేరునే మార్చే స్థాయికి వచ్చారన్నారు. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అట, ఆ తర్వాత మనవడట, అటు తర్వాత మునిమనవడట అంటూ ఎద్దేవా చేశారు. ఇదేమైనా నిజం 1, నిజాం 2. నిజాం 3గా అనుకుంటున్నారన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ బరితెగించిందన్నారు. ఒక సీఎం ఇన్‌ఛార్జిగా ఉండటం ఇప్పుడే చూస్తున్నామన్నారు. అధికార పార్టీ పూర్తిగా దిగజారిందని పేర్కొన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని కేసీఆర్, కేటీఆర్ లు ప్రజలను నమ్మించే ప్రయత్నిస్తున్నారన్నారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని....
కల్వకుంట్ల కుటుంబాన్ని మార్చే రోజులు దగ్గరపడ్డాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. లారీల కొద్దీ మద్యం, కోళ్లను పంచుతున్నారన్నారు. అధికార దుర్వినియోగం, అక్రమ దాడులు, విచ్చలవిడి దోపిడీతనంతో వ్యవహరిస్తున్నారు. 1200 మంది అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈరోజు టీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. విలువలకు ఆ పార్టీ సమాధి కట్టే పరిస్థితికి వచ్చిందన్నారు. కవులు, కళాకారులను గెంటేశారన్నారు. ఎన్నికల అధికారిని బెదిరించి గుర్తుల కేటాయింపులో కూడా అవతవకలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇతర పార్టీల కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలను ఇవ్వమని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కల్వకుంట్ల మాఫియా రాజ్యాంగం తెలంగాణలో నడుస్తుందని ఆయన ఆరోపించారు.