నేడు కీలక మావోయిస్టు నేతల లొంగుబాటు
తెలంగాణ పోలీసుల ముందు ఇద్దరు తెలంగాణ మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు
chhattisgarh
తెలంగాణ పోలీసుల ముందు ఇద్దరు తెలంగాణ మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు. ఆత్రం లచ్చన్న , ఆత్రం అరుణ లొంగుబాటు కానున్నారు.తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఆత్రం లచ్చన్న ఉన్నారు. బస్తర్ లో డివిజన్ కమిటీ సెక్రెటరీ గా అరుణ ఉన్నారు. ఇటీవల మావోయిస్టులను భద్రతాదళాలు జల్లెడపడుతుండటంతో మావోయిస్టులు లొంగిపోతున్నారు.
అజ్ఞాతంలో ఉన్న...
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలంటూ పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. లేకపోతే తామే వారిని పట్టుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాలుగా అజ్ఞాతం లో ఉన్న లచ్చన్న నాలుగు గంటలకు రామగుండం పోలీస్ కమిషన్ ఎదుట లొంగిపోనున్నారు.లచ్చన్న స్వస్థలం ఆదిలాబాద్.