కేసీఆర్ క్షమాపణలు చెబితే రాజీనామా చేస్తా
తాను పార్టీ మారినట్లు ఆధారాలు లేవని కడియం శ్రీహరి తెలిపారు
తాను పార్టీ మారినట్లు ఆధారాలు లేవని కడియం శ్రీహరి తెలిపారు. తనకు ఎప్పుడూ బీఆర్ఎస్ నుంచి నోటీసులు జారీ కాలేదన్నారు. తనను కేసీఆర్ ప్రశ్నించాలని, ఆయన ప్రశ్నిస్తేనే సమాధానం చెబుతానని కడియం శ్రీహరి అన్నారు. స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నామని కడియం శ్రీహరి చెప్పారు. తనకు ఎలాంటి షోకాజ్ ఇవ్వలేదని కడియం శ్రీహరి అన్నారు. బీఆర్‌ఎస్‌ఎల్పీకి ప్రతినెల మా జీతం నుంచి రూ.5 జమ అవుతున్నాయని తెలిపారు. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు కాదా? అని ప్రశ్నించారు.
తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని...
అలాగే తాము 38 మంది సభ్యులున్నామని, అందుకు తగినట్లుగా సమయం కోరామని కూడా కడియం శ్రీహరి అన్నారు. తన హయాంలో ఫిరాయింపులకు కేసీఆర్ క్షమాపణలు చెబితే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి అన్నారు. ఇతరులు చేసే వ్యాఖ్యల గురించి తాను పట్టించుకోనని కడియం శ్రీహరి అన్నారు. తమపై వేసిన పిటిషన్లు చట్టబద్దం కావన్నారు. పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, కానీ తనకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని, పార్టీ పరంగా బీఆర్ఎస్ ఎందుకు పిటిషన్ వేయలేదని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నానని అన్నారు. . తామ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని, అధినాయకత్వానికి దూరంగా ఉన్నామని, కానీ ప్రజల కోసం తాము పని చేస్తున్నామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి మంత్రులను కూడా చేశారని, పార్టీ ఫిరాయింపులకు సూత్రదారులు మీరంటూ కేసీఆర్పై కడియం ధ్వజమెత్తారు.