Telangana : అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ తీర్పు

బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పనున్నా

Update: 2026-03-11 03:46 GMT

బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పనున్నారు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపు సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించి విచారణ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది మంది సభ్యులు పార్టీ మారారనడానికి ఆధారాలు లేవని ఇప్పటికే స్పీకర్ తీర్పు చెప్పారు.

ఇద్దరి ఎమ్మెల్యేలపై...
ఇటీవలే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల కు సంబంధించి అనర్హత పిటీషన్లపై కూడా విచారణ పూర్తయింది. నేడు ఈ ఇద్దరి విషయంలోనూ స్పీకర్ తీర్పు చెప్పనున్నారు. అయితే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది.


Tags:    

Similar News