Telangana : తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు

Update: 2026-03-11 07:32 GMT

తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణ స్వీకిరం చేయించారు. శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. ఇటీవల తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

రేవంత్ రెడ్డితో పాటు...
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లోక్ భవన్ లో నిరాడంబరంగా ముగిసింది. నిన్న హైదరాబాద్ చేరుకున్న శివప్రతాప్ శుక్లా నేడు తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ముఖ్మమంత్రితో పాటు మంత్రులు అభినందనలు తెలిపారు.


Tags:    

Similar News