Breaking : దానం, కడియంలకు ఊరట

బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పారు

Update: 2026-03-11 05:13 GMT

బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపు సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించి విచారణ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది మంది సభ్యులు పార్టీ మారారనడానికి ఆధారాలు లేవని ఇప్పటికే స్పీకర్ తీర్పు చెప్పారు.

ఇద్దరి ఎమ్మెల్యేలపై...
ఇటీవలే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల కు సంబంధించి అనర్హత పిటీషన్లపై కూడా విచారణ పూర్తయింది. ఈ రోజు ఈ ఇద్దరి విషయంలోనూ స్పీకర్ తీర్పు చెప్పారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో పార్టీ మారడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు చెప్పారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలను అనర్హత పిటీషన్ నుంచి స్పీకర్ ఊరట కల్పించారు.


Tags:    

Similar News