ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గరుడ టికెట్ ధర

TSRTC హైదరాబాద్-వరంగల్ రూట్లో రూ.54, హైదరాబాద్-విజయవాడ రూట్లో రూ.100, హైదరాబాద్-ఆదిలాబాద్ రూట్లో రూ.111, హైదరాబాద్-భద్రాచలం

Update: 2022-02-11 07:18 GMT

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించాలంటే అందరికీ అందుబాటులో ఉండే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆర్టీసీ. బస్సుల్లో నిత్యం వేలమంది ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనుల కోసం వెళ్లేవారు చాలా మంది ఉంటారు. తాజాగా టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో నాలుగు మార్గాల్లో గరుడ సర్వీసులు తిరుగుతుండగా.. వాటి ధరలను తగ్గించింది.

తాజా నివేదికల ప్రకారం.. TSRTC హైదరాబాద్-వరంగల్ రూట్లో రూ.54, హైదరాబాద్-విజయవాడ రూట్లో రూ.100, హైదరాబాద్-ఆదిలాబాద్ రూట్లో రూ.111, హైదరాబాద్-భద్రాచలం రూట్లో రూ.121 మేర టికెట్ ధరలను తగ్గించింది టీఎస్ఆర్టీసీ. కాగా.. మేడారం జాతరకు వెళ్లే ప్రస్తుత సర్వీసులు, ప్రత్యేక సర్వీసులకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. తగ్గించిన గరుడ ఛార్జీలు మార్చి 31,2022 వరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది.


Tags:    

Similar News