పెళ్లి మండపంలో విషాదం.. పెళ్లి కుమార్తె తండ్రి గుండెపోటుతో మృతి
కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి మండపంలోనే కుమార్తె తండ్రి గుండెపోటుతో మరణించారు
కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి మండపంలోనే కుమార్తె తండ్రి గుండెపోటుతో మరణించారు. కన్యాదానం చేసే సమయంలో యువతి తండ్రికి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దీంతో పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
పెళ్లికి అని వచ్చిన వారు...
దీంతో పెళ్లి మండపంలోనే యువతి తండ్రి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పెళ్లికి వచ్చిన బంధువులందరూ అంత్యక్రియల్లో పాల్గొనాల్సి రావడం విధి ఆడిన వింతనాటకమని బంధువులు వాపోతున్నారు. పెళ్లి పనుల్లో నిద్రలేకుండా గడపడం, వత్తిడి వెరసి పెళ్లి కుమార్తె తండ్రి మరణించారని సమీప బంధువులు తెలిపారు.