ఈ వాహనానికి ఎన్ని పెండింగ్ చలాన్లు ఉన్నాయో తెలుసా?
హనుమకొండ జిల్లా కాజిపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఒక వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంపై 233 చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు
ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హనుమకొండ జిల్లా కాజిపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఒక వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంపై 233 చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. బండిని ఆపి చల్లాన్లు ఎంత ఉన్నాయని పరిశీలించేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రయత్నించగా మెషిన్ నుంచి కాగితం చాలా సేపు వస్తూనే ఉంది.
45 వేలు పెండింగ్ ...
2016 నుంచి ఈ వాహనానికి చల్లాన్లు విధించిన చెల్లించకుండా తిప్పుతున్నారు. అయితే వాహనం యజమాని అస్లాం కూడా తనకు తెలియదని, ఈ వాహనాన్ని కరీంనగర్ లో ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేశానని, దీనిని విక్రయిచినా చలాన్లు సొమ్ము చెల్లించే స్థోమత లేదన్నారు. చలాన్ల విలువ నలభై ఐదు వేల రూపాయలు ఉండగా, బండి ప్రస్తుత విలువ పదిహేను విలువకు మించదని చెప్పడంతో వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.