High alert : కుంగిన వంతెన.. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్

తెలంగాణ - మహారాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మేడిగడ్డ వంతెన కుంగిపోవడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

Update: 2023-10-22 03:23 GMT

తెలంగాణ - మహారాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మేడిగడ్డ వంతెన ఒక్కసారిగా కుంగిపోవడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉండటంతో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ఈ బ్యారేజీపై రాకపోకలను నిలిపేశారు. ఇంజినీరింగ్ నిపుణులు బ్యారేజీ వద్ద కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కుంగిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. అటు వైపు ఎవరూ రాకండా బ్యారికేడ్లను నిర్మించారు.

కుంగిపోవడంతో...
గోదావరి నదిపై జయశంకర్ భూపాల జిల్లా మహదేవ్ పూర్ మండలంలో 2019లో ఈ బ్యారేజీని నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెెక్టులో భాగంగా తొిసారి దీనిని నిరమించారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఎనిమిది గేట్లు తెరిచారు. అయితే బ్యారేజీ18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన అడుగు మేర కుంగిపోవడంతో వాహనాల రాకపోకలను నిలిపేశారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.


Tags:    

Similar News