ఆదిలాబాద్‌లో చికెన్ మార్కెట్ బంద్
ఆదిలాబాద్‌లో చికెన్ మార్కెట్ ను వ్యాపారుల బంద్ చేశారు. బర్డ్ ఫ్లూ భయంతో మార్కెట్ నుబంద్ చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఆదిలాబాద్‌లో చికెన్ మార్కెట్ ను వ్యాపారుల బంద్ చేశారు. బర్డ్ ఫ్లూ భయంతో మార్కెట్ నుబంద్ చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల పాటు చికెన్ మార్కెట్ ను పూర్తిగా బంద్ చేస్తున్న్టట్లు వ్యాపారులు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ భయంతో ఇప్పటికే చికెన్ అమ్మకాలు తగ్గడంతో వ్యాపారాలు జరగక మొత్తం మార్కెట్ ను మూసేశారు.
వారం రోజులు...
వ్యాపారం జరగక, నిర్వహణ ఖర్చులు దండగ అని భావించి ఆదిలాబాద్ లో వ్యాపారులు చికెన్ మార్కెట్ ను బంద్ చేశారు. బర్డ్ ఫ్లూ భయం ప్రజల్లో ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చికెన్ ధరలను తగ్గించి అమ్మి నష్టాలను కొని తెచ్చుకోవడం కంటే వ్యాపారాలను మూసివేస్తే ఎలాంటి ఇబ్బందులుండవని వ్యాపారులు మార్కెట్ ను బంద్ చేశారు.