Breaking : ఎస్.ఎల్.బి.సి టన్నెల్ లో మృతదేహం ఆనవాళ్లు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్ద ఒక మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలిసింది.

Update: 2025-03-09 07:13 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్ద ఒక మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలిసింది. ఆపరేషన్ లో కీలక పురోగతి లభించింది. టీబీఎం మిషన్ ముందు భాగంలో మృతదేహం ఆనవాళ్లు సహాయక బృందాలు గుర్తించినట్లు సమాచారం. మృతదేహం కుడి చేయి, ఎడమ కాలు లభించింది. అయితే కుడి చేతికి కడియం ఉండటంతో దానిని ఇంజినీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా దీనిని గుర్తించినట్లు తెలిసింది.

గురుప్రీత్ సింగ్ దిగా...
ఎందుకంటే గురుప్రీత్ సింగ్ చేతికి కడియం ఉంటుందని చెబుతున్నారు. కానీ మృతదేహం ఆనవాళ్లు అయితే లభించాయి కానీ పూర్తి స్థాయిలో లభ్యం కాకపోవడంతో సహాయక బృందాలు ఆ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం మిషన్ వద్దనే ఈ ఆనవాళ్లు లభించడంతో తవ్వకాలు జరుపుతున్నారు. మరికొద్ది గంటల్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News