నేడు జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ నేడు జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా చేపట్టనుంది.
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ నేడు జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా చేపట్టనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో.. నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ధర్నా నిర్వహించనున్నారు.
ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జిల్లా స్థాయి ప్రముఖ నేతలు, బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొననున్నారు.