Prajavani : నేడు ప్రజావాణి కార్యక్రమం
నేడు ప్రజావాణి కార్యక్రమం ప్రగతి భవన్ లో జరగనుంది. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.
pragati bhavan
నేడు ప్రజావాణి కార్యక్రమం ప్రగతి భవన్ లో జరగనుంది. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. పెద్ద క్యూ లైన్ లో ప్రజలు వేచి ఉన్నారు. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రగతి భవన్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారానికి రెండు రోజుల పాటు ప్రజావాణి జరగనుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
నేరుగా సమస్యలను..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మంత్రులు, ఉన్నతాధికారుల వరకూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ గోడు చెప్పుకునేందుకు తరలివస్తుండటంతో క్యూ లైన్లలో వినతి పత్రాలను పట్టుకుని నిల్చున్నారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష‌్కరించే విధంగా చూస్తుండటంతో జనం అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.