తెలంగాణ ఎడ్ సెట్, లాసెట్ దరఖాస్తుల గడువు పెంపు

ఎడ్ సెట్ దరఖాస్తులకు గడువు పొడిగించడంతో అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేశారు. అలాగే లాసెట్..

Update: 2023-04-21 11:59 GMT

ts edcet and lawcet

తెలంగాణలో మే 18న ఎడ్ సెట్, మే 20, 25 తేదీల్లో లాసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 20వ తేదీతో గడువు ముగిసింది. అయితే.. తాజాగా ఈ గడువును ఏప్రిల్ 25 వరకూ పొడిగించారు. ఈ మేరకు ఎడ్ సెట్ కన్వీనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 20 వరకు ఎడ్ సెట్ కు 21,456 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

ఎడ్ సెట్ దరఖాస్తులకు గడువు పొడిగించడంతో అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేశారు. అలాగే లాసెట్ దరఖాస్తు కూడా ఏప్రిల్ 20కి ముగియగా.. ఆ గడువును ఏప్రిల్ 29 వరకు పొడిగిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే, ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20 నాటికి లాసెట్ కు 35,072 దరఖాస్తులు అందాయని కన్వీనర్ వివరించారు.


Tags:    

Similar News