జగిత్యాల జిల్లాలో పెద్దపులి.. అక్కడే ఉందంటూ?

జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది.

Update: 2025-01-27 04:24 GMT

జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఈ నెల 23వ తేదీన గుండుబాబు అనే వ్యక్తిపై పెద్దపులి దాడి చేయడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారు. ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో పెద్దపులి అక్కడే సంచరిస్తూ ఉంటుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు.

సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి...
పెద్దపులి సంచారంపై అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి జాడను కనుక్కోవడం కష్టంగా మారింది. పూర్తిగా వ్యవసాయం మీద ఆ ప్రాంత ప్రజలు ఆధారపడటంతో గత కొద్ది రోజులుగా పొలం పనులకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు పెుద్దపులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.


Tags:    

Similar News