వేపకు ఫంగస్ తేరుకుంటోందిలా!!

వేపచెట్టునే మాడ్చేసే ఫంగస్ 'ఫోమోప్సిస్ అజాడిరక్టే' ఇప్పుడు తెలంగాణలోని వేపచెట్లను పీడిస్తోంది.

Update: 2025-12-23 15:10 GMT

వేపచెట్టునే మాడ్చేసే ఫంగస్ 'ఫోమోప్సిస్ అజాడిరక్టే' ఇప్పుడు తెలంగాణలోని వేపచెట్లను పీడిస్తోంది. ఈ ఫంగస్ కారణంగా కొమ్మలు, రెమ్మలు పూర్తిగా ఎండుబారి చెట్టంతా నిర్జీవంగా మారిపోతుంది. ఇది సంవత్సరంలో కొంత కాలం పాటే చెట్లకు సోకుతుందని, ఆ తర్వాత వేప చెట్లు మళ్లీ కోలుకుని పచ్చగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది చెట్టుకు మాత్రమే సోకే ఫంగస్ వ్యాధి అని, దీని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. మళ్ళీ మార్చి నెలకల్లా ఈ చెట్లన్నీ తిరిగి యథావిధిగా పచ్చదనాన్ని సంత రించుకుంటాయన్నారు నిపుణులు. గతంలో ఈ వ్యాధి ఉత్తర భారతంలోని వేప చెట్లకు వచ్చేదని, ఇప్పుడు దక్షి ణాదిలోని చెట్లకూ సోకుతోందని తెలిపారు. వేప చెట్టులో ఉండే ఔషధగుణాల కారణంగా ఈ ఫంగస్ ను జయించి మళ్లీ కొత్తచివుర్లు సంతరించుకుంటూ ఉంది.

Tags:    

Similar News