Telangana : నేడు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణలో కొత్త మంత్రులకు నేడు శాఖలను కేటాయించే అవకాశముంది.

Update: 2025-06-09 01:47 GMT

తెలంగాణలో కొత్త మంత్రులకు నేడు శాఖలను కేటాయించే అవకాశముంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు నేడు శాఖలను కేటాయించనున్నారు. కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు నిన్న రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వారికి ఇంత వరకూ శాఖలను కేటాయించలేదు. అయితే నిన్న ఆదివారం కావడంతో నేడు శాఖలను కేటాయించనున్నారు.

నేడు కేటాయింపు...
మంత్రులుగా గడ్డం వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఎక్కువ గా ఉన్న శాఖలనుంచి వాటిని ఇస్తారా? అన్నది నేడు తేలనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోం, విద్య, మున్సిపల్ వంటి శాఖలు ఉండటంతో వాటిని ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నారు.


Tags:    

Similar News