సికింద్రాబాద్‌ - సిద్ధిపేట మధ్య కూతపెట్టనున్న తొలి రైలు

సిద్ధిపేట ప్రజల దశాబ్ధాల కల ఇక నెరవేరే సమయం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నవారి కల..

Update: 2023-10-02 14:49 GMT

సిద్ధిపేట ప్రజల దశాబ్ధాల కల ఇక నెరవేరే సమయం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నవారి కల నెరవేరనుంది. సొంతూరికి రైలుపై వెళ్లాలన్న కల నిజం కానుంది. మంగళవారం అంటే అక్టోబర్‌ 3వ తేదీ నుంచి సికింద్రాబాద్‌ – సిద్ధిపేట మధ్య తొలి రైలు పట్టాలెక్కనుంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు పుష్ పుల్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు ప్యాసింజర్‌ రైళ్లు మంగళవారం నుంచి సికింద్రాబాద్‌, సిద్ధిపేటల మధ్య పరుగులు పెట్టనున్నాయి. నిజానికి ముందుగా - సిద్ధిపేట మధ్య రైలును నడిపించాలని భావించారు.

టికెట్‌ ఛార్జ్‌ ఎంతంటే..

అయితే సికింద్రాబాద్‌ నుంచే ప్రజలు పెద్ద ఎత్తున వస్తారన్న కారణంతో సికింద్రాబాద్‌ నుంచి రైలు సేవలు ప్రారంభించేందుకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇంతకీ ఈ రైలు ఏయే స్టేషన్స్‌లో ఆగుతుంది.? టికెట్‌ రేటు ఎంత? లాంటి పూర్తి వివరాలు తెలుసుకోండి. సికింద్రాద్‌ నుంచి సిద్ధిపేటకు రైలు మార్గం మొత్తం 116 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే ప్యాసింజర్‌ రైలు మల్కాజిగిగి, కెవలరీ బ్యారక్స్‌, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, నాచారం, బేగంపేట, గజ్వేల్‌, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్ధిపేట స్టేషన్స్‌లో ఆగతుంది. ఇక సికింద్రాబాద్‌ నుంచి సిద్ధిపేట వరకు రైలు ఛార్జీ రూ. 60గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ట్రైన్‌ టైమింగ్‌ షెడ్యూల్‌:

ఇక ముదుగా రైలు నెంబర్ 07483 సిద్ధిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్‌లో 07484 నెంబర్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు సిద్ధపేట చేరుకుంటుంది. అనంతరం తిరిగి సిద్ధిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరీ సికింద్రాబాద్‌కు సాయంత్రం 5.10గంటలకు చేరుకుంది. ఇక చివరిగా సికింద్రాబాద్‌లో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరిన రైలు సిద్ధిపేటకు రాత్రి 8.40 గంటలకి చేరుకుటుంది. సిద్ధిపేట, సికింద్రాబాద్‌ల మధ్య నడుస్తోన్న బస్సు ఛార్జీలతో పోల్చితే రైలు ప్రయాణం సగం అని చెప్పాలి.
Tags:    

Similar News