Telangana : మూడు రోజులు నిప్పుల కుంపటేనట

తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

Update: 2024-04-18 03:07 GMT

తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎండల దెబ్బకు బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు వేడి గాలులు కూడా జనాన్ని భయపెడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎండ వేడిమిని తట్టుకోవడం కష్టంగానే ఉంది. ఇళ్లలో ఉండే వారు కూడా ఉక్కపోతకు ఇబ్బంది పడిపోతున్నారు.

అత్యధిక ఉష్ణోగ్రతలు...
ఇప్పటికే తెలంగాణలోని జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రత రానున్న నాలుగు రోజులు మరింత అధికంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని రావాలని సూచిస్తుంది. నిన్న ఇరవై మండలాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా నిడమానూరులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపంది. మూడు రోజుల పాటు వాతావరణం కూడా పొడిగా ఉంటుందని తెలిపింది.


Tags:    

Similar News