Telangana : నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శీతాకాల సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి
తెలంగాణ శీతాకాల సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు పలు కీలక అంశాలపై శాసనసభలో చర్చ జరగనుంది. ప్రధానంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గత ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను ఏజెన్సీలకు అప్పగించందన్న దానిపై అధికార పక్షం చర్చకు సిద్ధమైంది. అలాగే కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా ఎందుకు వినియోగించుకోలేకపోయిందో సభ ద్వారా వివరించేందుక ప్రయత్నం చేయనుంది.
కీలక అంశాలపై...
నీటి ప్రాజెక్టులపై నేడు చర్చ జరిగే అవకాశముంది. ఈరోజు కృష్ణానదిపై నిర్మించనున్న ప్రాజెక్టులతో పాటు నీటి కేటాయింపుల విషయంలో చర్చ జరగనుంది. దీంతో పాటు తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతో నిర్వహించడానికి అవకాశాలపన కూడా సభలో చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో ఉపాధి హామీ పథకంపై నేడు స్వల్పకాలిక చర్చ జరగనుంది. పేరు మార్చడమే కాకుండా నిబంధనలను మార్చడంపై చర్చించనుంది