Telangana : నేడు వర్షం కురిసే ప్రాంతాలివే
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
heavy rains in telangana
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, శని, ఆదివారాల్లో వర్సం పడే అవకాశముందని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడకక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తేలికపాటి వర్షం మాత్రం...
ఇతర ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి చిరు జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న అత్యధికంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 7.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.