అప్పగింతల సమయం.. అమ్మ గుండె ఆగింది
అప్పగింతలు.. కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి గడపదాటి వెళ్తుంటే అమ్మనాన్నల బాధ వర్ణనాతీతం.
అప్పగింతలు.. కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి గడపదాటి వెళ్తుంటే అమ్మనాన్నల బాధ వర్ణనాతీతం. ఇన్నాళ్లూ ఇంట్లో తిరిగిన బిడ్డ ఒక్కసారిగా కనబడకపోతే.. నేను వెళ్ళొస్తా మీరందరూ జాగ్రత్త అని పెళ్లి కూతురు చెప్పగానే కంట్లో నుండి వచ్చే నీటిని ఇక ఆపలేము. అలా కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించి, అత్తవారింటికి పంపే క్రమంలో ఆ తల్లి హఠాత్తుగా కుప్పకూలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కామేపల్లి మండలం అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహన్‌లాల్, కల్యాణి దంపతుల పెద్ద కుమార్తె సింధుకు వివాహం జరిపించారు. ఆ తర్వాత కుమార్తె అప్పగింతల కార్యక్రమం ఉండగా తల్లి కళ్యాణి భావోద్వేగానికి గురైంది. అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది.