Telangana : నేటి నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

తెలంగాణలో నేటి నుంచి ఒక పూట బడులు జరగనున్నాయి

Update: 2025-03-02 02:33 GMT

తెలంగాణలో నేటి నుంచి ఒక పూట బడులు జరగనున్నాయి. రంజాన్ మాసం ప్రారంభమయిన సందర్భంగా ఉర్దూ స్కూళ్లకు మాత్రమే ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఉర్దూ స్కూళ్లలో ఒంటిపూట బడులు కొనసాగుతాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రంజాన్ సందర్భంగా కేవలం ఉర్దూ విద్యాసంస్థలకు మాత్రమే ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించారు.

రంజాన్ మాసం కావడంతో...
ఉదయం నుంచి పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉర్దూ విద్యాసంస్థలు నేటి నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన విద్యాసంస్థలు మాత్రం యధాతధంగా నడుస్తాయని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags:    

Similar News