Telangana : కొత్త డీజీపీగా పేర్లు పరిశీలనలో ఇవే,, కొత్త పోలీస్ బాస్?

తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది

Update: 2025-04-29 08:08 GMT

తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎనిమిది మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. 1990 బ్యాచ్ కు చెందిన రవి గుప్తా, 1991 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్, 1992 బ్యాచ్ కు చెందిన డా. జితేందర్ , 1994 బ్యాచ్ కు చెందిన ఆప్టే వినాయక్ ప్రభాకర్, 1994 బ్యాచ్ కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, 1994 బ్యాచ్ కు చెందిన బి. శివధర్ రెడ్డి, 1994 బ్యాచ్ కు చెందిన సౌమ్య మిశ్రా , 1994 బ్యాచ్ శిఖా గోయల్ పేర్లను పంపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీపీఎస్సీకి పంపింది.

అర్హతల ఆధారంగా...
అర్హతల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లును సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపనుంది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన, రవి గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అలాగే సీవీ ఆనంద్ 2028 జూన్ లోనూ, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్ లోనూ, బి. శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28వ తేదీన, సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30న, శిఖాగోయల్ 2029 మార్చి వరకు సర్వీస్ లో ఉంటారు.


Tags:    

Similar News