ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సచివాలయంలో తెలంగాణ గవర్నర్, సీఎం

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో

Update: 2023-08-25 08:24 GMT

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. తర్వాత వచ్చిన గవర్నర్ కు స్వాగతం పలికారు. ఆమెతో కలిసి సీఎం కేసీఆర్ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి, మసీదులను కూడా ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత గవర్నర్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ ప్రాంగణంలోకి గవర్నర్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచివాలయ ప్రారంభోత్సవం సమయంలో తనకు ఆహ్వానం లభించలేదని గవర్నర్ చెప్పారు. మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్, గవర్నర్ తో 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవాలకు ఆహ్వానించారు. దీంతో గవర్నర్ హాజరయ్యారు.

పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది. ‘కొత్త సచివాలయం అద్భుతంగా ఉన్నది. ఈ మధ్య కొత్త సచివాలయం ముందు నుంచి వెళ్తున్నప్పుడు చూశాను. బాగుంది’ అని గవర్నర్‌ అనగా, ‘హైదరాబాద్‌ గంగాజమునా తెహజీబ్‌కు ప్రతీకగా సచివాలయ ప్రాంగణంలో ఆలయం, మసీదు, చర్చి నిర్మించాం. శుక్రవారం పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 12 గంటలకు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రావాలని సీఎం ఆహ్వానించిచారు. తప్పకుండా వస్తానని గవర్నర్‌ చెప్పారు. చెప్పినట్లుగానే కార్యక్రమానికి హాజరయ్యారు గవర్నర్.


Tags:    

Similar News