బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత

తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత బిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు

Update: 2022-04-05 04:42 GMT

తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత బిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బిక్షమయ్య గౌడ్ 2018లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. గతంలో ఆలేరు నియోజకవర్గానికి బిక్షమయ్య గౌడ్ ప్రాతినిధ్యం వహించారు. ఆలేరు అభివృద్ధి కోసమే తామను అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరినా, అక్కడ తనను కొందరు అడ్డుకుంటున్నారని బిక్షమయ్య గౌడ్ ఆరోపించారు.

తనపై ఆంక్షలు....
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. ఆయనకు తరుణ్ చుగ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఆలేరు నియోజకకవర్గంలో తనను పర్యటించవద్దని తనను పార్టీ నేతలు ఆదేశించారని బిక్షమయ్య గౌడ్ పేర్కొన్నారు. ప్రజలను స్వేచ్ఛగా కలిసేందుకే తాను బీజేపీలో చేరానని బిక్షమయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు.


Tags:    

Similar News