Telangana : మద్యం వినియోగంలో తెలంగాణ టాప్

దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచింది.

Update: 2025-12-23 08:13 GMT

దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా నమోదయింది. అయితే ఇటీవల కాలంలో వరసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం కూడా మద్యం వినియోగానికి కారణం కావచ్చని అంటున్నారు. తెలంగాణలో మద్యం వినియోగం ఎక్కువగానే ఉంటుంది.

ఏపీ మూడో స్థానంలో...
మద్యం విక్రయాలు ఎక్కువగా తెలంగాణలోనూ జరుగుతుంటాయి. అందుకే మద్యం షాపులకు ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక 4.25 లీటర్లు, తమిళనాడు 3.38 లీటర్లు,ఆంధ్రప్రదేశ్ 2.71 లీటర్లు, కేరళ2.53 లీటర్లు వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో మద్యంపై తలసరి ఖర్చు రూ.11,351 కాగా, ఆంధ్రప్రదేశ్ .6,399గా ఉంది.


Tags:    

Similar News