Telangana : 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 వ తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 వ తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ సమావేశాలను ఈ నెల 29వ తేదీ నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. కొద్దిగా విరామం ఇచ్చి తర్వాత జనవరి రెండో తేదీ నుంచి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.
నీటి పారుదల అంశాలపై...
తెలంగాణ శీతాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ నెల 29వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాల వాటాకు సంబంధించిన అంశంతో పాటు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానుంది. కేసీఆర్ ఇటీవల పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చేసిన విమర్శలపై కూడా సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది.