Telangana : నేడు రెండు జిల్లాల్లో గవర్నర్ పర్యటన

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు

Update: 2025-12-23 04:09 GMT

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గద్వాల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే తొలుత జోగులాంబ ఆలయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకుంటారు.జోగులాంబ ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

ద్వాల్, వనపర్తి జిల్లాల్లో...
అనంతరం గద్వాల్, వనపర్తి జిల్లాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. అనంతరం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా రెండు జిల్లాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గవర్నర్ పర్యటనలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News