Telangana : గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దసరా పండగకు ముందే

గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-09-26 04:45 GMT

గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్ ను దసరా పండగ లోపు వెల్లడించాలని నిర్ణయించినట్లు సమాచారం. దసరా లోపు ఎంపికయిన వారికి నియామక పత్రాలను అందచేయాలని కసరత్తులు ప్రారంభించింది. తుదిజాబితాను సిద్ధం చేసే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

తుది ఫలితాల ఎంపికకోసం...
తుది ఫలితాల ఎంపిక మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుందని, వెంటనే ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రూప్ 2 లో మొత్తం 783 పోస్టుల భర్తీకి సంబంధించి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింి. అయితే 2024లో రాత పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకులను టీజీపీఎస్సీ ప్రకటించింది. మరో వారం రోజుల్లో తుది ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ సిద్ధమవుతుంది.


Tags:    

Similar News