Telangana: ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల ప్రోఫైల్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు..

Update: 2023-12-07 05:24 GMT

Telangana: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం, మంత్రులను గవర్నర్‌ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌ మంత్రుల జాబితాలో ఉన్న వారికి ఫోన్‌లు చేశారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సీఎంతో పాటు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

భట్టి విక్రమార్క్‌:

1961, జూన్‌ 15న జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ, HCUలో పీజీ పూర్తి చేశారు. 2009లో తొలిసారిగా మదిర నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009-11 మధ్య ఉమ్మడి ఏపీ చీఫ్‌విప్‌గా ఎన్నికయ్యారు. 2011-2014 మధ్య ఉమ్మడి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2009023 మధ్య భట్టి విక్రమార్క మదిరలో నాలుగు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు.

సీతక్క:

మంత్రిగా బాధ్యతలు చేపట్టే సితక్క 1971, జూలై 9న జన్మించారు. 1988లో 10వ తరగతిలోనే నక్సల్స్‌ పార్టీలో చేరారు. జన నాట్య మండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం చేశారు. 2 దశాబ్దాల పాటు కామ్రేడ్‌గా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు సీతక్క. ఎన్టీఆర్‌ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 2001లో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 2004లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో తొలిసారిగా ములుగు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో ఓటమి, అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ములుగు నుంచి గెలుపొందారు.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి:

1962 జూన్‌ 20న జన్మించారు. బీఎస్సీ గ్రాడ్యుయేట్‌ ఇండియన్‌ ఫోర్స్‌ మాజీ పైలట్‌. 1999-2009 మధ్య కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 వరకు ఉమ్మడి ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2015-2021 మధ్య తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ఉత్తమ్‌. 2009-2018 మధ్య హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యేగా పని చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపొందారరు. 2023లో మరోసారి హుజుర్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

1963 మే 23న జన్మించారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2009-2014 మధ్య నల్గొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లో చోటు దక్కించుకున్నారు. 2011లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. 2019లో నల్గొండ ఎంపీగా గెలుపొందారు. 2023లో మరోసారి నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Tags:    

Similar News