నాలుగు వారాలు అత్యంత కీలకం

వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Update: 2022-01-06 08:02 GMT

వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. 90 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతాయని కూడా ఆయన చెప్పారు. డెల్టా వేరియంట్ ఇంకా కనుమరుగు కాలేదని ఆయన తెలిపారు. నాలుగు వారాల పాటు ఎవరూ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకపోవడమే మంచిదని శ్రీనివాసరావు తెలిపారు.

పండగను కూడా....
సంక్రాంతి పండగను కూడా కోవిడ్ నిబంధనలతో జరుపుకోవాలని ఆయన కోరారు. కోవిడ్ బారిన పడినా స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని చెప్పారు. ఏమాత్రం లక్షణాలు కన్పించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అంతే తప్ప సొంత వైద్యం చేసుకోవద్దన్నారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెద్దగా లేదన్నారు. ప్రయివేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు. ఆరోగ్య శాఖలో సెలవులను దర్దు చేశామని చెప్పారు.


Tags:    

Similar News