Telangana : హంగ్.. టెన్షన్ పడుతున్న పార్టీలు...క్యాంప్ లో గెలిచినోళ్లు

తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హంగ్ ఏర్పడటంతో కౌన్సిలర్లను క్యాంప్ లకు తరలించారు

Update: 2026-02-15 08:16 GMT

తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హంగ్ ఏర్పడటంతో కౌన్సిలర్లను క్యాంప్ లకు తరలించారు. బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మహారాష్ట్రకు తరలించారు. కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను హైదరాబాద్ కు తరలించారు. క్యాంప్ నుంచి రేపు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. రేపు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుండటంతో అన్ని పార్టీలు దాదాపు క్యాంప్ నకు తరలించాయి. కమ్యునిస్టులు తమ కార్పొరేటర్లను ఏపీకి తరలించారు.

మున్సిపాలిటీలు ఎవరివో?
రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగ్గా, 24 మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో హంగ్ ఏర్పడింది. మూడు కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కరీంగనర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. పరకాల, అలంపూర్‌, నర్సాపూర్‌, జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్‌, ఆసిఫాబాద్‌, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత, కోహీర్‌, దేవరకద్ర, ఆసిఫాబాద్‌, వేములవాడ, రాయికల్‌, జహీరాబాద్‌, మహబూబాబాద్‌, ఆలియాబాద్‌, బోధన్‌, గద్వాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి తదితర మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. కొన్నింటిలో అధికార కాంగ్రెస్ ఇప్పటికే ఇతర పార్టీల కౌన్సిలర్లను తీసుకు రావడంతో కొంత ఛైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం చేసుకుంది.
మూడు కార్పొరేషన్లలో టెన్షన్...
నిజామాబాద్ కార్పొరేషన్లలో కాంగ్రెస్, ఎంఐఎం కలసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని తీసుకుని అధికారాన్ని పంచుకునేలా ప్లాన్ చేశాయి. కొత్త గూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్, సీపీఐ కలసి చెరి రెండేళ్లు మేయర్ పదవిని తీసుకోవాలని ఒప్పందం కుదిరింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లుంటే అందులో 30 బీజేపీకి వచ్చాయి. ఒక బీజేపీ రెబల్ అభ్యర్థి, మరొక స్వతంత్ర అభ్యర్థి బీజేపీలో చేరారు. కో ఆప్షన్ ఓటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇద్దరు ఎమ్మెల్సీల ఓటుతో 33కు చేరడంతో బీజేపీ మేయర్ పదవిపై ధీమాగా ఉంది. కానీ కరీంనగర్ లో తమదే గెలుపు అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంతో ఈ సీటు ఎవరికి దక్కనుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద రేపు ఎన్నిక జరిగే సమయానికి ఏదైనా జరగొచ్చని అంటున్నారు.



Tags:    

Similar News