ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ

సభ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని ప్రశ్నిస్తూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు మరోమారు విచారణ చేసిన కోర్టు..

Update: 2022-03-11 10:50 GMT

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సభ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని ప్రశ్నిస్తూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు మరోమారు విచారణ చేసిన కోర్టు.. స్పీకర్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

ఈ కేసుపై మరింత విస్తృతంగా విచారణ చేపట్టే దిశగా.. మరోసారి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులిచ్చేందుకు హైకోర్టు అనుమతించలేదు. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ను ఎత్తివేసేందుకు నిరాకరించిన కోర్టు.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన చేయడంతో పాటు స్పీకర్ తో వాగ్వాదానికి దిగడంతో సస్పెన్షన్ కు గురయ్యారు.


Tags:    

Similar News