Telangana :గ్రూప్–1 ఫలితాలపై నేడు హైకోర్టులో విచారణ
గ్రూప్ 1 ఫలితాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది.
గ్రూప్ 1 ఫలితాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీ.ఎం. మొహియుద్దీన్ బుధవారం గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ పునర్మూల్యాంకనం చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన బ్యాచ్ అప్పీల్ ను విచారించనున్నారు.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై...
సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్ చేయాలని, అది సాధ్యం కాకుంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. మంగళవారం ఈ కేసులో ఒక అప్పీల్ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు వచ్చింది. రాష్ట్రం తరఫున, టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుధర్శన్‌రెడ్డి హాజరై, అన్నీ అప్పీల్స్ ఒకేసారి వినాలని కోరారు. దీనిని అంగీకరించిన బెంచ్ బుధవారం కలిపి విచారిస్తామని తెలిపింది. దీంతో నేడు విచారణ జరగనుంది.