Telangana : నేడు కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు
తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పై నేడు కీలక తీర్పుచెప్పనుంది.
తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పై నేడు కీలక తీర్పుచెప్పనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు రానుంది.
నివేదికను రద్దు చేయాలంటూ...
ఈ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు, స్మితాసబర్వాల్, ఎస్‌కే జోషి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగియగా తీర్పు రిజర్వు చేసింది. నేడు హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.