Telangana : నేడు మల్లు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
తెలంగాణ ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.
తెలంగాణ ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈరోజు ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధుల విషయంలో అన్ని పార్టీల మద్దతును అధికార పార్టీ కూడగట్టే ప్రయత్నం చేస్తుంది.
పెండింగ్ లో ఉన్న...
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నందున, అభివృద్ధి పనులను నిలిచిపోయే అవకాశముందని మల్లు భట్టి విక్రమార్క వారికి వివరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ సమస్యల సాధన కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ఆహ్వానం పంపారు. అన్ని పార్టీలకూ మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు.