Telangana : నేడు సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం నేడు సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. దసరా పండగ సందర్భంగా బోనస్ ప్రకటించనుంది

Update: 2025-09-22 02:42 GMT

తెలంగాణ ప్రభుత్వం నేడు సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. దసరా పండగ సందర్భంగా బోనస్ ప్రకటించనుంది. సింగరేణి కార్మికులకు ఏటా దసరా సందర్భంగా ప్రభుత్వం బోనస్ ప్రకటిస్తుంది. సింగరేణి కాలరీస్ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత శ్రమించిన కార్మికులకు పంచడం తెలంగాణలో ఆనవాయితీగా వస్తుంది.

భారీగా బోనస్ ప్రకటించనున్న...
సింగరేణి కార్మికులకు నేడు బోనస్ ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కూడా పాల్గొంటారు. సింగరేణి కార్మికల సంక్షేమం కోసం బోనస్ తో పాటు అనేక కీలక ప్రకటనలు చేసే అవకాశముందని సమాచారం. భారీ మొత్తంలో బోనస్ ప్రకటించే అవకాశముంది.


Tags:    

Similar News