సజీవదహనమయిన 42 మందిలో హైదరాబాదీలు ఎందరు?

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది

Update: 2025-11-17 04:21 GMT

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున మక్కా నుంచి మదీనాకు వెళుతున్న ఒక బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రయాణికులతో వెళుతున్న బస్సు పూర్తిగా దహనమయింది. ఈ ఘటనలో 42 మంది సజీవదహనమయ్యారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు...
వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులున్నారన్న సమాచారంతో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ను ఏర్పాట్ు చేసింది. ఢిల్లీ నుంచి సౌదీ అరేబియా అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 79979 59574, 9912919545 నెంబర్లకు బాధిత కుటుంబ సభ్యులు సంప్రదించవచ్చని కోరారు. హైదరబాద్ నుంచి మక్కా సందర్శనకు వెళ్లిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.


Tags:    

Similar News