Telangana : డీజీపీ నియామకంపై జాబితాను తిప్పి పంపిన యూపీఎస్సీ
తేలంగాణ పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి యూపీఎస్సీకి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పంపింది
తేలంగాణ పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి యూపీఎస్సీకి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, ఆప్టే, సౌమ్య మిశ్రా,షికా గోయల్ పేర్లు ఉన్నాయి. దీనికి యూపీఎస్సీ తిరుగు టపాలో తిరిగి పంపించింది.
సుప్రీంకో్టు అనుమతి కావాలంటూ...
ఈనియామకానికి సుప్రీంకోర్టు అనుమతి కావాలంటూ ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి యూపీఎస్సీ పంపింది. ఆలస్యంగా జాబితా పంపడంతో సుప్రీం అనుమతి కావాలని సమాధానం యూపీఎస్సీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి పంపిన సమాధానంలో తెలిపారు. తొమ్మిది నెలల క్రితం ఒకసారి, గత నెల 31న రెండోసారి డీజీపీల ప్యానెల్ జాబితా పంపామని ప్రభుత్వం చెప్పింది.