Telangana : 14 నుంచి పదో తరగతి పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి

Update: 2026-03-11 12:44 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి, ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే విద్యార్ధుల హాల్‌ టికెట్లు కూడా విడదలయ్యాయి. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 8096958096 వాట్సాప్‌ నంబరు ద్వారా కూడా హాల్‌టికెట్లు ఈ సారి రాష్ట్ర వ్యాప్తం గా మొత్తంగా 5,28,239 మంది పరీక్షలకు హాజరవు తున్నారు. వీరిలో రెగ్యుల ర్‌ విద్యార్థులు 5,17,727 మంది ఉన్నారు. 5,329 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, 1,057 గురుకులాల నుంచి 60, 139 మంది, 5,288 ప్రైవే ట్, ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి 2,50,015 మంది పరీక్షలు రాయనున్నారు.

పరీక్షా కేంద్రాలకు...
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాలకు విద్యార్ధులు సులువుగా చేరుకునేం దుకు హాల్‌టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను కూడా ముద్రించారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా దీనిని స్కాన్‌ చేస్తే రూట్ మ్యాప్‌ ఆటోమెటిక్‌గా ఓపెన్‌ అవుతుంది. సీ సీ కెమెరాల ముందే పరీక్ష పేపర్ ఓపెన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని, ఐదు నిమిషాలు ఆలస్యమయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారుు.



Tags:    

Similar News