Telangana : ఎల్ఆర్ఎస్ గడువు పెంపు

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఎల్ఆర్ఎస్ కు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-05-13 04:11 GMT

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఎల్ఆర్ఎస్ కు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లే అవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి గడువు ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించింది. ఈలోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకుటే 25 శాతం రాయితీ లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మే 31వ తేదీ వరకూ...
మార్చి నెల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఆహ్వానించింది. తొలుత ఏప్రిల్ 30 వతేదీ వరకూ గడువు విధించింది. తర్వాత మూడు రోజుల పాటు అదనంగా గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నెల 31వ తేదీ వరకూ ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సమయం ఇచ్చింది.


Tags:    

Similar News