Telangana : తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి లైన్ క్లియర్
తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి లైన్ క్లియర్ చేస్తూ జీవో విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి లైన్ క్లియర్ చేస్తూ జీవో విడుదల చేసింది. తెలంగాణకు సీబీఐకి ఎంట్రీ లేకుండా నాటి కేసీఆర్ ప్రభుత్వం 2022లో ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ జరిపేందుకు తెలంగాణ శాసనసభ రెండు రోజుల క్రితం తీర్మానం చేసిన సంగతి నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కాళేశ్వరం వరకే...
సీబీఐకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, కాగ్, జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలను కూడా కేంద్ర హోంశాఖకు పంపిన ఉత్తర్వులతో ప్రభుత్వం పంపింది. అయితే సీబీఐ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణకు మాత్రమే అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.