గుడ్ న్యూస్.. ఎన్ని ప్రభుత్వఉద్యోగాలో

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది

Update: 2022-12-30 12:17 GMT

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. వైద్య ఆరోగ్యశాఖ లోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో డీఎంఈ, డీఎచ్ పరిధిలో 3,823 పోస్టులున్నాయి. ఇక వైద్య విధాన పరిషత్ లో 757 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్ జే సతంస్థల్లో 81, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాస్థంస్థల్లో 127 పోస్టులున్నాయి.

నోటిఫికేషన్ విడుదల...
అలాగే దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ విభాగంలో ఎనిమిది, మహాత్మా జ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ విభాగంలో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లో 13 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హతకలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News