ఒమిక్రాన్ తో అప్రమత్తం
ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. వ్యాక్సినేషన్ ను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో మొదటి సారి డోసు కూడా వందశాతం పూర్తి కాలేదు. ఈ నెల 22వ తేదీ లోగా వందశాతం మొదటిడోసును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
తొలి డోసును...
ఇప్పటికే తెలంగాణలో మొదటి డోసును పూర్తి చేసుకున్న జిల్లాలు కేవలం పదహారు మాత్రమే. మూడు జిల్లాల్లో 99 శాతం పూర్తయింది. దీంతో మిగిలిన జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. కొత్త వేరియంట్ లను తట్టుకోవాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.